Hajj Pilgrims : హజ్ యాత్రలో 550 మందికి పైగా మృతి

Hajj Pilgrims : హజ్ యాత్రలో 550 మందికి పైగా మృతి
X

ఈ ఏడాది హజ్ యాత్రలో ఇప్పటివరకు 550 మందికి పైగా యాత్రికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో అత్యధికంగా ఈజిప్షియన్లు 323 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వీరంతా వేడి సంబంధిత సమస్యలతోనే మరణించినట్లు వెల్లడించారు. 60 మంది జోర్డానియన్లు కూడా మృతి చెందారన్నారు. ప్రస్తుతం మక్కాలో 50డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది 240కి పైగా మరణాలు చోటుచేసుకున్నాయి.

మక్కా సమీపంలో ఉన్న అల్-ముయిసెమ్‌లోని ఆసుపత్రిలో మృతదేహాలను ఉంచినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సంబంధీకులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించాయి. తమ దేశం నుంచి వచ్చిన యాత్రికులు చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని ఈజిప్టు ప్రభుత్వ వర్గాలు హజ్‌ నిర్వహకులకు తెలియజేశాయి. వారిని గుర్తించేందుకు ముమ్మర చర్యలు చేపట్టినట్లు వెల్లడించాయి. చనిపోయిన వారిలో 60 మంది జోర్డాన్‌వాసులు కూడా ఉన్నారు. గత ఏడాది 240 మరణాలు నమోదయ్యాయి. వీరిలో చాలా మంది ఇండోనేషియాకు చెందినవారు.

ఇక ఈ ఏడాది హజ్ యాత్రలో 1.8 మిలియన్లకు పైగా యాత్రికులు పాల్గొనే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ యాత్ర బుధవారంతో ముగియనుంది. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు తీవ్ర ఎండలు ఉంటాయని, యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని సౌదీ ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Tags

Next Story