Putin : పుతిన్‌పై నావెల్నీ భార్య కోపం.. భవిష్యత్తును నాశనం చేశారని ఫైర్

రష్యాలో (Russia) విపక్ష నేత అలెక్సీ నావెల్నీ అనుమానాస్పద మరణం దుమారం రేపుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నావెల్నీ మరణ వార్త బయట వచ్చిన మూడు రోజులకు.. అతడి భార్య యూలియా మీడియాతో మాట్లాడారు.
పుతిన్ తన భర్తను చంపేశారని ఆరోపించారు యూలియా నావెల్నీ. "మూడు రోజుల క్రితం.. నా భర్తను పుతిన్ చంపేశారు. అలెక్సీని చంపేసి.. పుతిన్ నాలో సగ భగాన్ని చంపేశారు. నా గుండెని సగం చంపేశారు. నా ఆత్మను సగం చంపేశారు. కానీ నా దగ్గర ఇంకో సగం ఉంది. నేను పోరాడటాన్ని ఆపను. అలెక్సీ నావల్నీ ఆశయాల కోసం నేను పోరాడతాను," అని అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూలియా నావెల్నీ ఆవేదన వ్యక్తంచేశారు.
తన భర్తను పుతిన్ మనుషులు.. 'నావిచోక్' (Naavichok) అనే ప్రమాదకరమైన నర్వ్ ఏజెంట్ ఇచ్చి హత్య చేశారని యూలియా ఆరోపించారు. అది శరీరం నుంచి మాయమయ్యేందుకు అధికారులు ఎదురుచూస్తున్నారని, అందుకే తమకు ఇంకా నావల్నీ మృతదేహాన్ని కూడా ఇవ్వలేదని తెలిపారు. స్వేచ్ఛాయుత రష్యాలో బతకాలని తనకు ఉందని.. ప్రజలు తనతో కలిసి వచ్చి.. తమ కోపాన్ని, బాధని చూపించాలంది. రష్యా ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్న వారిపై కోపాన్ని బయటపెట్టాలని పిలుపునిచ్చింది యూలియా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com