Zelensky : యుద్ధం ముగింపు ఇప్పట్లో లేనట్లే: జెలెన్‌స్కీ

Zelensky : యుద్ధం ముగింపు ఇప్పట్లో లేనట్లే: జెలెన్‌స్కీ
X

రష్యాతో యుద్ధ ముగింపు ఇప్పట్లో కనిపించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. అగ్రరాజ్యం అమెరికా నుంచి తమకు మద్ధతు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘యూఎస్‌తో మా బంధం ఇప్పటిది కాదు. అందుకే మా సంబంధం కొనసాగుతుందని భావిస్తున్నా. అమెరికాతో డీల్‌కు మేం సిద్ధం. ఉక్రెయిన్ ప్రజలు ఎల్లప్పుడూ అమెరికాకు రుణపడి ఉంటారు. ఇందులో సందేహమే లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

జెలెన్‌స్కీ‌ రష్యాతో నిరంతర యుద్ధాన్నికోరుకుంటున్నారని మస్క్ ఆరోపించారు. ఆయనలో యుద్ద కాంక్ష తీరట్లేదని ఇది చాలా దుర్మార్గమని విమర్శలు చేశారు. అమెరికా, యూరప్ సాయం ఉన్నంత వరకూ జెలెన్‌స్కీ యుద్ధాన్ని ముగించరన్న ట్రంప్ ట్వీట్ మస్క్ రీపోస్ట్ చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న మిలిటరీ సాయం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో జెలెనీస్కీ మరోసారి చర్చలకు సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేశారు. రష్యాతో శాంతి విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సహకరించడం లేదని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆ దేశానికిచ్చే సాయాన్ని ఆయన సమీక్షిస్తున్నారని శ్వేతసౌధం పేర్కొంది. ‘అధ్యక్షుడి దృష్టంతా శాంతిస్థాపన మీదే ఉంది. రష్యా-ఉక్రెయిన్ సమస్య పరిష్కారం కోసం ఆయన కృషి చేస్తున్నారు’ అని తెలిపింది.

Tags

Next Story