Trump : భారత్‌పై ఇంకా మొత్తం సుంకాలు విధించలేదు.. ట్రంప్ ఏమన్నారంటే..?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై తాను విధించిన సుంకాల గురించి, రష్యా నుండి చమురు కొనుగోళ్ల గురించి, అలాగే చైనా, రష్యా, ఉత్తర కొరియాల గురించి పలు వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను అత్యధిక సుంకాలు విధించే దేశంగా పేర్కొన్నారు. భారత్ అమెరికాపై భారీగా సుంకాలు వేయడం వల్ల అమెరికాకు చెందిన వ్యాపారాలు భారత్‌లో సరిగా జరగడం లేదని, కానీ భారత్‌కు మాత్రం అమెరికాతో మంచి వ్యాపారం ఉందని అన్నారు. తాను అధికారంలోకి రాకముందు ఈ సంబంధాలు ఏకపక్షంగా ఉండేవని, కానీ తాను వచ్చాక పరిస్థితి మారిందన్నారు.
ప్రస్తుతం భారత్ సుంకాలను పూర్తిగా ఎత్తివేయడానికి ముందుకు వచ్చిందని ట్రంప్ తెలిపారు. అమెరికా సుంకాలు విధించకపోతే భారత్ ఇలాంటి నిర్ణయం తీసుకునేది కాదని అభిప్రాయపడ్డారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ఇంకా పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించలేదని, 'సెకండరీ సుంకాలు' మాత్రమే విధించానని, మరిన్ని దశలను ఇంకా చేపట్టలేదని కూడా ట్రంప్ స్పష్టం చేశారు.
చైనా, రష్యా, ఉత్తర కొరియాపై ఆరోపణలు
ట్రంప్ చైనా, రష్యా, ఉత్తర కొరియా అధ్యక్షులు జిన్‌పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ ముగ్గురు అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. చైనా ఆయుధ ప్రదర్శన నేపథ్యంలో ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా కోసం పోరాడిన అమెరికన్ సైనికుల త్యాగాలను గుర్తించాలని ట్రంప్ కోరారు. అలాగే, చైనా అధ్యక్షుడికి, ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com