Pakistan : యుద్ధానికి సిద్ధమవుతోన్న పాక్!

Pakistan : యుద్ధానికి సిద్ధమవుతోన్న పాక్!
X

భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇందులో భాగంగా LOCకి అటువైపు ఆర్మీ దళాలను భారీగా మోహరిస్తోంది. కేవలం బంకర్ల నుంచే నిఘా ఉంచాలని సైనికులను ఆదేశించింది. రావల్పిండి కేంద్రంగా పని చేస్తున్న 10దళాల సైనికులను అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని పాక్ ఆర్మీ ఆదేశించింది. LOCతో పాటు అంతర్జాతీయ సరిహద్దులైన సియాల్‌కోట్, గుజ్రాన్‌వాలా వద్ద ఉన్న సైనికులనూ అలర్ట్‌ చేసింది.

ఉగ్రదాడిలో పాక్ హస్తముందని ఆరోపిస్తూ ఇండియా ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు పాక్ తీరు తప్పును ఒప్పుకున్నట్లే ఉంది. దాడి చేయకపోతే, చేయలేదని చెప్పకుండా ప్రతీకార చర్యలకు దిగింది. సరిహద్దులకు సైన్యాన్ని పంపి యుద్ధానికి సై అంటోంది. ఇండియా ఆరోపణలు అవాస్తమైతే దౌత్య సంబంధాలు దెబ్బతినకుండా వ్యవహరించాల్సింది పోయి పాక్ వ్యవహరిస్తున్న తీరు దోషినని ఒప్పుకున్నట్లుగానే ఉంది.

Tags

Next Story