Pakistan : ఎండిపోతున్నాం.. నీళ్లివ్వాలంటూ భారత్ కు పాక్ లేఖలు

సింధూ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని అభ్యర్థిస్తూ భారత్ కు పాకిస్తాన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు లేఖలు రాసింది. ఏప్రిల్ 22న పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా పొరుగు దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. దాంతో పాకిస్తాన్లో తీవ్రమైన నీటి సంక్షో 'భం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ కు ముందు మే నెలలో ఒకసారి, ఆ తర్వాత మూడు సార్లు దాయాది దేశం భారత్ కు లేఖలు రాసింది.
పాక్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయీద్ అలీ ముర్త రాసిన నాలుగు లేఖలను కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేంద్ర జలశక్తి మంత్రి త్వ శాఖ పంపించింది. అదే సమయంలో 1960లో ఒప్పం దానికి మధ్యవర్తిత్వం వహించిన ప్రపంచ బ్యాంకును సింధూ జలాల విడుదల విషయంలో జోక్యం చేసుకొ "వాలని పాకిస్తాన్ కోరగా అందుకు ప్రపంచ బ్యాంకు నిరాకరించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com