Pakistani Women : ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చిన పాకిస్తానీ మహిళ

ఒకే కాన్పులో ఒకరికంటే ఎక్కువమంది పుడితే అది ఎప్పటికైనా, ఎక్కడైనా ఆసక్తికరమైన వార్తే. పాకిస్థాన్ లో అలాంటి సంఘటనే జరిగింది. పాకిస్థాన్లోని రావల్పిండిలో ఓ మహిళ.. ఒకే కాన్పులో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఈ ఆరుగురులో నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీరందరి బరువు.. 2 పౌండ్ల కన్నా తక్కువగా ఉంది. తల్లీబిడ్డలు అందరు ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారులు చెప్పారు.
ఒకే కాన్పులో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చిన మహిళ పేరు జీనత్ వహీద్. ఆమె భర్త పేరు మహమ్మద్ హవీద్. పురుటి నొప్పులతో జీనత్ హవీద్.. గురువారం రాత్రి రావల్పిండిలోని జిల్లా ఆసుపత్రిలో చేరింది. శుక్రవారం ఆమె.. బిడ్డలకు జన్మనిచ్చింది. గంటలోపే.. ఆమె మొత్తం ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చింది హవీద్. బిడ్డలను ఇన్క్యూబేటర్లో పెట్టారు డాక్టర్లు.
మొదట ఇద్దరు అబ్బాయిలు పుట్టారనీ.. ఆ తర్వాత ఆడబిడ్డ పుట్టిందని.. అలా మిగతావారికి తల్లి జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు. ఇది నార్మల్ డెలివరీ కాదని డాక్టర్లు తెలిపారు. కేవలం 50లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలా పుట్టి అందరూ బతికి బట్టకట్టే పరిస్థితి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com