Israel : ఇజ్రాయిల్ దాడులు.. పాలస్తీనా ప్రధాని రాజీనామా

Israel : ఇజ్రాయిల్ దాడులు..  పాలస్తీనా ప్రధాని రాజీనామా

Israel : దాడుల నేపథ్యంలో పాలస్తీనా ప్రధాని మొహమ్మద్ శతాయె ( Mahmoud Abbas) రాజీనామా చేశారు. గాజా తోపాటు వెస్ట్బ్యంక్, జెరుసలాం ప్రాంతాల్లో ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అధ్యక్షు డు అబ్బాస్కు రాజానామా లేఖ అందజేశారు. గాజా స్త్రీప్పై దురాక్రమణకు సంబంధించి చోటుచేసుకుంటున్న పరిణామాలు, వెస్ట్బ్యంక్ జెరుసలేంలో హింసాత్మక ఘటనలు కలచివేశాయి.

ఇజ్రాయెల్ చేస్తోన్న పోరు ముగిసిన తర్వాత, ఇక్కడ రాజకీయ ఏర్పాట్ల గురించి పాలస్తీనియన్లలో ఒక ఏకాభిప్రాయం ఏర్పడటానికి వీలుగా తాను రాజీనామా చేస్తున్నానని అన్నారు. అయితే, రాజీనామా ఆమోదం గురించి అధ్యక్ష కార్యాలయం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. పాలస్తీనా ఇన్వెస్టిమెంట్ ఫండ్ చైర్మన్ గా ఉన్న మొహమ్మద్ ముస్తఫాను నూతన ప్రధానిగా నియమించే అవకాశం ఉందని తెలుస్తున్నది.

యుద్ధం ముగిసిన తర్వాత, గాజా ప్రాంతాన్ని పాలించే రాజకీయ వ్యవస్థ నిర్మాణంపై ఇప్పటికే ప్రయ త్నాలు మొదలైనట్లు సమాచారం. ఇందు కోసం పాలస్తీనా అథారిటీని పునర్ వ్యవస్థీకరించాలని అమెరికా భావిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై పాలస్తీనా అధ్యక్షుడిపై అగ్రరాజ్యం నుంచి తీవ్ర ఒత్తిడి ఉందనే వాదన వినిపిస్తోంది. పాలస్తీనా అథారిటీలో సంస్కరణలు చేపట్టాలంటే అనేక అడ్డంకులు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రధాని రాజీనామా కీలక పరిణామంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story