Pakistan : పాకిస్తాన్‌కు ప్రధాని శుభాకాంక్షలు
భారత ప్రధానమంత్రి రూటే సెపరేట్. ఆయన శైలి అందిరకీ విభిన్నం. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్య దేశానికి నాయకుడిగా ప్రధానమంత్రిగా సేవలు అందిస్తున్న నరేంద్రమోడీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. నోబెల్ శాంతి పురస్కారం కూడా ప్రదాని మోడీని వరిస్తుందన్న ప్రచారం జరుగుతోంది.
తన మాటలతో.. చేతలతో హాట్ టాపిక్ అవుతుంటారు ప్రధాని మోడీ. తాజాగా.. పాకిస్థాన్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందించారు. పాకిస్థాన్ ప్రధానిగా హెహబాజ్ షరీఫ్ ప్రమాణస్వీకారం చేసి, రెండోసారి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా షెహబాజ్ షరీఫ్ కు భారత ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
పాక్ ప్రధానిగా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు షెహబాజ్ షరీఫ్. షెహబాజ్ కు అభినందనలు అంటూ ఎక్స్ వేదికగా మోడీ శుభాకాంక్షలు తెలిపారు. పొరుగు దేశం.. మన దాయాది కావడంతో ప్రధాని స్నేహపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పారు. కొత్త ప్రధాని భారత్ కు దోస్త్ గా ఉండాలని మోడీ కోరుకుంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com