Gift : ఉత్తర కొరియాకు రష్యా బహుమతి.. ఇది కదా వెరైటీ!
ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చిరు నవ్వులు చిందిస్తూ ఒకే కారులో హుషారుగా షికారు చేయడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయింది. ఆ కారును కిమ్ కు పుతిన్ గిఫ్ట్ గా ఇచ్చారు. దానిపేరు ఆరుస్ లిమో సిన్.
పుతిన్ కాన్వాయ్ లో అది కీలకం. దీనిలో ఉయోగించే విడిభాగాల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి, దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నారు. కస్టమ్ రికార్డులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా ఓ కథనాన్ని వెల్లడించింది. కారు బాడీ పార్ట్స్, సెన్సార్లు, కంట్రోలర్లు, స్విచ్లు, వెల్డింగ్ పరికరాలతో సహా ఇతర భాగాలను దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నందుకు 15.5 మిలియన్ డాలర్లను రష్యా కేటాయించింది. మిగిలినవాటిని చైనా, భారత్, తుర్కియే, ఇటలీ, ఐరోపా యూనియన్ నుంచి తెప్పించుకుంది.
ఈ ఆరుస్ కార్లు... రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరిశోధక సంస్థ ఎస్ఏఎమ్, కార్ల తయారీ సంస్థ సోలర్స్ భాగస్వామ్యంలో తయారవుతున్నాయి. కిమ్ కు పుతిన్ రెండు ఆరుస్ లిమోసిన్ కార్లను బహూకరించారు. సౌత్ కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకుని నార్త్ కొరియాకు రష్యా గిఫ్టుగా రెండు కార్లను ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com