Putin : భారత్ - చైనాల పట్ల అమెరికా వైఖరి సరైనది కాదు.. పుతిన్ కీలక వ్యాఖ్యలు

Putin : భారత్ - చైనాల పట్ల అమెరికా వైఖరి సరైనది కాదు.. పుతిన్ కీలక వ్యాఖ్యలు
X

వ్యాపార యుద్ధంలో భారత్, చైనాల పట్ల అమెరికా వైఖరి సరైనది కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన భారత్, చైనాలపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతుందని పుతిన్ విమర్శించారు. టారిఫ్‌లతో ఈ రెండు దేశాల నాయకులను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. "1.5 బిలియన్ల జనాభా ఉన్న భారత్, చైనాలు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలు. వాటికి ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థలు, చట్టాలు ఉన్నాయి" అని పుతిన్ పేర్కొన్నారు. టారిఫ్‌లతో ఈ దేశాలను శిక్షించే ప్రయత్నాలు ఆయా దేశాల నాయకుల రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడతాయని హెచ్చరించారు.

వలసవాదం, సార్వభౌమాధికారం

భారత్, చైనాలు గతంలో వలసవాద పాలనలో చాలా కష్టాలను అనుభవించాయని పుతిన్ గుర్తు చేశారు. వారి సార్వభౌమాధికారంపై చాలాకాలం పాటు పన్ను విధించారని, ఇప్పుడు ఆ కాలం ముగిసిందని అన్నారు. "ఈ దేశాలను అణగదొక్కేలా మాట్లాడటం సరైనది కాదు. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు సరైన పదాలు ఉపయోగించాలి" అని ట్రంప్‌కు పరోక్షంగా సూచించారు. అయితే, ప్రస్తుత ఉద్రిక్తతలు త్వరలోనే ముగుస్తాయని, పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Next Story