Russia : రష్యా అధ్యక్షుడిగా పుతిన్ పాంచ్ పటాకా

వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం క్రెమ్లిన్ లో వైభవోపేతంగా జరిగిన కార్యక్రమంలో ఐదోసారి రష్యా అధినేతగా బాధ్యతలు చేపట్టారు. పుతిన్ మరో ఆరు సంవత్స రాలు అధ్యక్షుడుగా కొనసాగనున్నారు. ఇప్పటికే సుమారు పాతిక సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు పుతిన్.
జోసెఫ్ స్టాలిన్ తరువాత దీర్ఘకాలం కొనసాగిన పుతిన్ రికార్డుల కెక్కనున్నారు. పుతిన్ కొత్త పదవీ కాలం 2030 వరకు ఉంటుంది. ఆ తరువాత రాజ్యాంగం ప్రకారం ఆయనకు పదవిలో కొనసాగే అర్హత ఉండదు.
గ్రాండ్ క్రిమ్లిన్ ప్యాలెస్ లోపల జరిగిన కార్యక్రమంలో పుతిన్ రష్యన్ రాజ్యాంగంపై చేయి వేసి దానిని పరిరక్షిస్తానని ప్రతిన చేశారు. కొద్ది మంది ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అధ్యక్షుడు బోరిస్ ఎన్నిన్ వారసుడుగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పుతిన్.. రష్యాను ఆర్థిక పతన స్థితిలో నుంచి ప్రపంచ భద్రతకు ముప్పు కలిగించే శక్తిమంతమైన దేశంగా మార్చడంలో సక్సెస్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com