Moscow : మాస్కోలో మండుతున్న ఎండలు.. వందేళ్లలో రికార్డ్

Moscow : మాస్కోలో మండుతున్న ఎండలు.. వందేళ్లలో రికార్డ్
X

గత వందేళ్లలో ఎన్నడూ లేని ఎండలు రష్యాను హడలెత్తిస్తున్నాయి. ప్రస్తుతంలో రష్యాలో హీట్ వేవ్ పరిస్థితులు భీకరంగా కొనసాగుతున్నాయి. జూలై ఆరంభం నుంచి ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు.

గురువారం మాస్కోలో 1917 రికార్డును బద్దలు కొట్టింది. మైనస్ 40 డిగ్రీల సెల్సియసు పడిపోయే మాస్కోలో జూలై 3న 32.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం మరింత పెరిగి 1917 రికార్డ్ ను బద్దలు కొట్టింది. ఇక రష్యా అంతటా 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంత వేడి వాతావరణం ఉన్న కూడా రష్యన్లు మాత్రం ధైర్యంగానే ఎదుర్కొంటున్నారు.

రష్యాలోని పసిఫిక్ తీరం, సైబీరియా అడవుల నుంచి యూరోపియన్ భాగాల వరకు హీట్ వేవ్ రికార్డులు బద్దలయ్యాయి. వేడి వాతావరణం కారణంగా ఎయిర్ కండిషనర్లకు డిమాండ్ పెరిగింది. అలాగే ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ విపరీతంగా సేల్ అవుతున్నాయి. హీట్ వేవ్ ను తట్టుకునేందుకు ప్రజలు వీటిపైన ఆధారపడుతున్నారు.

Tags

Next Story