Trump : ఉక్రెయిన్ ను కోరుకుంటే రష్యా పతనమే : ట్రంప్

Trump : ఉక్రెయిన్ ను కోరుకుంటే రష్యా పతనమే : ట్రంప్
X

ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే అది రష్యా పతనానికి దారి తీస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పిచ్చి పట్టి ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తన ట్రూత్ సోషల్ మీడియాలో ఆయన ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కీవ్ సహా ఇతర నగరాలపై వరుసగా మూడో రోజు డ్రోన్లతో దాడులకు పాల్పడటం చూస్తుంటే ఆయన సహనం కోల్పోయినట్లు అర్థం అవుతుందన్నారు. తాను సైనికులను చంపడం గురించి మాట్లాడటం లేదని, అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఆయన శాంతిని మాత్రమే కోరుకోవడం లేదని, ఉక్రెయిన్ ను కోరుకుంటున్నట్లు తాను ఇప్పటికే చెప్పినట్లు గుర్తు చేశారు. ఇటీవల భారత్-పా కిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ యూఎస్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తన జోక్యంతోనే ఇరు దేశాలు కాల్పుల విమరణకు అంగీకరించాయని అప్పట్లో ప్రకటింటిన ట్రంప్ తాజాగా రష్యా - ఉక్రెయిన్ వ్యవహారంలో తలదూర్చాడు.

Tags

Next Story