Russia : యుక్రెయిన్ పై మళ్లీ రష్యా భీకర దాడి

Russia : యుక్రెయిన్ పై మళ్లీ రష్యా భీకర దాడి
X

యుక్రెయిన్ పై మరోసారి రష్యా రెచ్చిపోయింది. యుక్రెయిన్ విద్యుత్‌ వ్యవస్థలే లక్ష్యంగా 200 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో లక్షలాది ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఆ ప్రాంతాల్లో చీకటితోనే తెల్లారుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ఈ తరహా దాడి చేయడం ఇది 11వసారి. దేశవ్యాప్తంగా విద్యుత్‌ కేంద్రాలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్‌ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని తెలిపింది. వింటర్‌ను ఆయుధంగా రష్యా వాడుకుంటోంది. విద్యుత్‌ వ్యవస్థల పునరుద్ధరణకు తమ ఇంజినీర్లు కృషి చేస్తున్నారని, సాధ్యమైనన్ని ప్రాంతాల్లో సరఫరాకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది. యుక్రెయిన్ లో చలికాలం అత్యంత తీవ్రంగా ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో పడిపోతాయి. దాంతో తాగునీరు, ఇళ్లలో హీటర్ల కోసం విద్యుత్‌ ఎంతో కీలకం. ఇదే సమయంలో ఆ దేశ పవర్‌ గ్రిడ్‌లను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులు చేయడం ఉక్రెయిన్ పౌరులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గురువారం ఒక్కరోజే 100 డ్రోన్లు, 90 క్షిపణులతో యుక్రెయిన్ లోని 17లక్ష్యాలపై తమ సైన్యం దాడి చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ వెల్లడించారు. హైపర్‌సోనిక్ క్షిపణులతో దాడులు చేయబోతున్నామని వార్నింగ్ ఇచ్చారు. ఇవన్నీ యుక్రెయిన్ ప్రతీకార దాడుల్లో భాగమేనన్నారు.

Tags

Next Story