Russian President : ప్రేమలో పడ్డ రష్యా అధ్యక్షుడు

రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) మరో మారు వార్తల్లో నిలిచాడు. బార్బీ భామతో లేటు వయసులో ఘాటు ప్రేమలో పడ్డాడు. 71 ఏండ్ల పుతిన్ 39 ఏండ్ల కాత్యా మిజులినాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు రష్యా మీడియా చెబుతోంది. బార్బీ బొమ్మలా కనిపించే ఏకథరినా కాత్యా మిజులినా లండన్‌లో గ్రాడ్యుయేషన్ చేసి, ప్రస్తుతం రష్యా సేఫ్ ఇంటర్నెట్ లీగ్ చీఫ్‌గా పనిచేస్తోంది.
పుతిన్.. ఏకథరినా మిజులినాతో కొంతకాలంగా ప్రేమాయణంలో ఉన్నట్టు రష్యాలోని సోషల్ మీడియా కథనాలు కోడై కూస్తున్నాయి. పుతిన్‌కు అనుకూలుడైన మాజీ సెనెటర్ కుమార్తెయే మిజులినా. కాగా, మాజీ ఫ్లైట్ అటెండెంట్ ల్యూడిమిలాను పుతిన్ 1983లో వివాహం చేసుకుని 2014లో విడాకులు ఇచ్చారు. అనంతరం ఒలింపిక్ బంగారు పతక విజేత అయిన జిమ్నాస్ట్ అలినా కబేవాతో రహస్య సంబంధాన్ని కొనసాగించాడని, వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని సమాచారం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com