Helicopter Crash : ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ క్రాష్ పై సంచలన రిపోర్ట్

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పటినుంచి కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ హెలికాప్టర్ పై దాడి జరిగి ఉండొచ్చని కొందరు అనుమానించారు. ఐతే.. హెలికాప్టర్ పై అటాక్ ఏమీ జరగలేదని ఆ దేశ మీడియా ప్రకటించింది.
హెలికాప్టర్ కూలిన వెంటనే దాంట్లో మంటలు వ్యాపించినట్లు మిలిటరీ విచారణాధికారులు పేర్కొన్నారు. సైనిక దళాలకు చెందిన జనరల్ స్టాఫ్ దీనిపై ప్రకటన రిలీజ్ చేశారు. అజర్ బైజాన్ బోర్డర్ సమీపంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో అధ్యక్షుడు రైసీతో పాటు మొత్తం ఆరు మంది మరణించారు. దాంట్లో విదేశాంగ మంత్రి కూడా ఉన్నారు. హెలికాప్టర్ కూలడానికి ముందు కంట్రోల్ టవర్, హెలికాప్టర్ సిబ్బంది మధ్య జరిగిన సంభాషణ విన్నప్పుడు ఎటువంటి అనుమానం వ్యక్తం కాలేదని మిలిటరీ జనరల్ ప్రకటించారు.
హెలికాప్టర్ కూలడానికి 90 సెకన్ల ముందు ఆ హెలికాప్టర్ కు ఎస్కార్ట్ గా వెళ్తున్న మరో రెండు హెలికాప్టర్ల మధ్య చివరి కమ్యూనికేషన్ జరిగినట్లు అధికారులు తేల్చారు. హెలికాప్టర్ పై ఫైరింగ్ జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని, ఆ హెలికాఫ్టర్ వెళ్తున్న మార్గంలో కూడా ఎటువంటి మార్పు లేదన్నారు. పూర్తిగా మంచు పట్టిన పర్వత శ్రేణుల్లో ఎగిరిన బెల్ కంపెనీ హెలికాప్టర్ పర్వతాలపై కూలింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com