Pakistan : పాకిస్తాన్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్

Pakistan : పాకిస్తాన్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్

పాకిస్తాన్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన జాతీయ ఎన్ని కల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించని పరిస్థితుల్లో, ప్రభుత్వ ఏర్పాటుకు పాకిస్తాన్ ముస్లిం లీగ్ -నవాజ్ (పిఎం ఎల్-ఎస్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) జట్టుకట్టాయి. రెండు ప్రధాన పార్టీలు అధికార భాగస్వామ్య ఫార్ములాపై అంగీకారానికి వచ్చాయి. దీనిప్రకారం షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి కార్యాలయానికి నామినేట్ చేయబడతారు. అలాగే ఆసిఫ్ అలీ జర్దారీ అధ్యక్ష పదవికి పోటీచేస్తారు.

అంతకుముందు, మంగళవారం అర్థరాత్రి, జర్దారీ హౌస్ లో జా యింట్ ప్రెస్మీట్లో పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ, పిఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ అధికార భాగ స్వామ్యంపై స్పష్టత ఇచ్చారు. 72 ఏళ్లషెహబాజ్ మరోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపడతారని వెల్లడించారు. పీపీపీ కో-చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీని అధ్యక్ష పదవికి ఉమ్మడి అభ్యర్థిగా నిలిపేందుకు కూటమి నిర్ణ యించింది.

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మాకుంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పా టు చేస్తాం అని బిలావల్ విలేకరులతో అన్నారు. కాగా, జాతీయ అసెంబ్లీలో స్పీకర్ పోస్టు పీఎం ఎల్-ఎన్ పార్టీకి దక్కనున్నది. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి పీపీపీకి వెళ్లనున్నది. సేనేట్ చైర్మెన్ పదవి పీపీపీ ఖాతాలో వెళ్లనున్నది. డిప్యూటీ చైర్మెన్ పదవి నవాజ్ లీగ్ పార్టీకి లభిస్తుంది.

ఈమేరకు భాగస్వామ్యంపై రెండుపార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. పాకిస్తాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే, 133 మంది ఎంపీల మద్దతు అవసరం. పార్లమెంట్ ఎన్నికల్లో పీటీఐ 33, పీఎంఎల్- ఎన్ 75 సీట్లు గెలుచుకోగా, పీపీపీ 54 స్థానాలను కైలసం చేసుకుంది. ఎంక్యుఎం-పిపార్టీకి 17 సీట్లు వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story