Russia-North Korea : రష్యాపై సౌత్ కొరియా మళ్లీ పైర్

రష్యా, ఉత్తర కొరియాల మధ్య కొత్త ఒప్పందంపై సౌత్ కొరియా సీరియస్ గా ఉంది. కుదిరిన కొత్త సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం యూఎన్ఓ భద్రత మండలి తీర్మానాల ఉల్లంఘనేనని దక్షిణ కొరియా మండిపడింది.
యుద్ధాలు చేయడం, ఆక్రమణ లకు పాల్పడటం వంటి చరిత్ర ఉన్న రెండు దేశాలు.. ఎప్పటికీ జరగని దాడుల గురించి ముందస్తుగా మిలిటరీ ఒప్పందం కుదుర్చుకోవడం విడ్డూరమని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే మాస్కోపై పోరాడేందుకుగాను యుక్రెయిన్ కు అవసరమైన ఆయుధాల సరఫరాపైనా ఆలోచన చేస్తామని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం ఓ డేరింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది.
కిమ్ ఆహ్వానం మేరకు ఉత్తర కొరియాలో పుతిన్ ఇటీవల రెండు రోజులు పర్యటించారు. రెండు దేశాల్లో దేనిపైనైనా శత్రువు దాడి జరిపితే పరస్పరం సహకరించుకోవాలని ఇరునేతలు ఒప్పందంపై సంతకాలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com