South Korea : సౌత్ కొరియాకు పుతిన్ డెడ్లీ వార్నింగ్

రష్యా, ఉత్తర కొరియాల మధ్య కుదిరిన నూతన సైనిక సహకార ఒప్పందంపై మండిపడ్డ దక్షిణ కొరియా.. మాస్కోపై పోరాడేందుకు ఉక్రెయిన్ కు ఆయుధాల అందజేతపై ఆలోచన చేస్తామని చెప్పడం సంచలనం రేపింది. ఒకవేళ ఇదే పనిచేస్తే సియోల్ అతిపెద్ద తప్పిదం చేసినట్లవుతుందని రష్యా అధినేత పుతిన్ తాజాగా హెచ్చరించారు.
తమపై దాడుల కోసం యుద్ధ సామగ్రి సరఫరా చేయాలని నిర్ణయించుకుంటే.. ఆ దేశానికి మింగుడుపడని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు పుతిన్. వియత్నాం పర్యటనలో భాగంగా పుతిన్ విలేకరులతో మాట్లాడారు. అమెరికా, దాని మిత్రదేశాలు కీప్కు ఆయుధాల సరఫరా కొనసాగిస్తే.. తామూ ప్యాంగాంగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఉత్తర కొరియా తదితర దేశాలకు ఆయుధాలను సరఫరా చేసే హక్కు, తమకూ ఉందని అని పుతిన్ అన్నారు. కీవ్ కు ఆయుధాలను సరఫరా చేసే విషయమై వివిధ అవకాశాలను పరిశీలిస్తామని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ఈ వ్యవహారాన్ని రష్యా ఎలా చక్కదిద్దుతుందనే దానిపై ఆధారపడి తమ వైఖరి ఉంటుందని వివరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com