Airtel Joins With Starlink : ఎయిర్టెల్‌తో స్టార్ లింక్ జట్టు

Airtel Joins With Starlink : ఎయిర్టెల్‌తో స్టార్ లింక్ జట్టు
X

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క చెందిన స్టార్అంక్ స్పేస్ ఎక్స్ భారత్ లో సేవలు ప్రారంభించబోతోంది. భారతీ ఎయిర్టెల్ స్పేస్ఎక్స్ ఒప్పందం చేసుకుంది. దేశంలో స్పేస్ఎక్స్ తన స్టార్అంక్ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన రెగ్యులేటరీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతులు వస్తే స్టార్రింక్ సర్వీస్లు దేశంలో ప్రారంభం అవుతాయి. ఎయిర్టెల్, స్పేస్ఎక్స్ ఒప్పందంతో దేశంలో ఈ రెండు సంస్థలు ఇంటర్నెట్ సేవలు అందిస్తాయి. ఈ ఒప్పందం ప్రకారం ఎయిర్టెల్ స్టార్అంక్ ఎక్విప్మెంట్ ను తన స్టోర్ల ద్వారా అందిస్తుంది. కస్టమర్లకు స్టార్అంక్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఎయిర్టెల్ ద్వారా అందించనున్నారు. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్స్, హెల్త్ కేర్ సెంటర్లు, మారుమూల గ్రామాలకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించనున్నాయి. ఎయిర్టెల్ ప్రస్తుత నెట్వర్క్ ను మరింత మెరుగుపరడానికి ఉన్న అవకాశాలను కూడా ఈ ఒప్పందం దృష్టిపెట్టనుంది.

ప్రధానంగా స్టార్ లింక్ ద్వారా శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలను మెరుగుపర్చడంపై దృష్టి కేంద్రీకరిస్తారు. శాటిలైట్ ఇంటర్నెట్ సేవల మూలంగా మారుమూల ప్రాంతాలు, వ్యాపార సంస్థలు హై స్పీడ్ నెట్తో ప్రయోజనం పొందుతాయి. భారత్లోని ఎయిర్టెల్ కస్టమర్లు స్పేస్ ఎక్స్ కు చెందిన స్టార్అంక్ ద్వారా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందుకుం టారని ఎయిరనెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విఠల్ చెప్పారు. ఈ ఒప్పందం మూలంగా తాము అత్యంత నాణ్యమైన హై స్పీడ్ ఇంటర్నెట్ను కస్టమర్లకు అందించగ లమని చెప్పారు. శాటిలైట్ ఇంటర్నెట్ మూలంగా దేశంలో ఎక్కడ నుంచైనా వేగంతమైన నెట్ సేవలను అందుకోగలరని చెప్పారు. ఎయిర్టెల్తో కలిసి పని చేయడానికి తాము సంతోషంగా ఉన్నామని స్పేస్ఎక్స్ ప్రెసిడెంట్ గ్విన్ షాట్వెల్ చెప్పారు. భారత్ ప్రజలకు స్టార్లాంక్ సేవలను అందించడానికి తాము ఉత్సాహంగా ఉన్నామని చెప్పారు. ఎయిర్టెల్ కు క్షేత్ర స్థాయిలో ఉన్న మౌలిక సదుపాయలను స్పేస్ఎక్స్ ఉపయోగించుకోనుంది.

Tags

Next Story