Russia War : రష్యాతో యుద్ధం ఆపించండి.. భారత్‌కు అమెరికా విజ్ఞప్తి

Russia War : రష్యాతో యుద్ధం ఆపించండి.. భారత్‌కు అమెరికా విజ్ఞప్తి
X

రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు లభించేలా కృషి చేయాలని భారత్ కు అమెరికా విజ్ఞప్తి చేసింది. రష్యాతో ఉన్న దీర్ఘకాల బంధాన్ని అందుకు ఉపయోగించుకోవాలని హితవు పలికింది. 'చట్ట విరుద్ధమైన ఈ యుద్ధానికి ముగింపు పలికేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడాలని కోరింది. అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ- మాస్కోల మధ్య బలమైన సంబంధాలు ఉన్నట్లు గుర్తు చేశారు మిల్లర్. యూఎన్ఓ చట్టాలను గౌరవించాలని పుతిన్కు సూచించాలని భారత్ ను కోరారు. రష్యాతో భారత్ కు సుదీర్ఘ బంధం ఉంది. ఇది అందరికీ తెలిసిందే. దాన్ని ఉపయోగించుకోవాలని భారతదేశాన్ని అమెరికా ప్రోత్సహిస్తోంది. రష్యాతో పటిష్ఠ బంధం, దానివద్ద ఉన్న విశిష్ట స్థానాన్ని ఉపయోగించుకొని అధ్యక్షుడు పుతిన్ మాట్లాడాలని కోరుతున్నాం. చట్టవిరుద్ధమైన యుద్ధాన్ని ముగించి శాంతి స్థాపనకు కృషి చేయాలని ఆయనకు చెప్పమని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.

మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని పుతిన్ అందజేశారు. ఈ సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బాంబులు, తుపాకులు, బుల్లెట్లు శాంతి చర్చలను సఫలం చేయలేవని స్పష్టం చేశారు. అదే సమయంలో ఉక్రెయిన్ పై యుద్ధాన్ని పరిష్కరించడంలో సహకరిస్తున్న మోదీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Next Story