China-Thaiwan : సైనిక చర్యలు ఆపండి.. చైనాకు తైవాన్ రిక్వెస్ట్

చైనాతో తాము శాంతిని కోరుకుంటున్నామని తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ తెలిపారు. తమ దేశంపై సైనిక చర్య లను ఆపేయాలని కోరారు. చైనాతో తైవాన్ మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తైవాన్ కొత్త అధ్యక్షుడి గా లాయ్ చింగ్ మ్ చింగ్ తె(64) బాధ్యతలు చేపట్టాక క చేసిన తొలి ప్రసంగంలో చైనాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. అలాగే సైనికులు కవాతు చేశారు. తైవాన్ జెండాతో సైనికులు హెలికాఫ్టర్లపై విన్యాసాలు చేశారు. కొవిడ్ మహమ్మారి, చైనాతో తీవ్రఉద్రిక్తతల వేళ తైవాన్ ను ఎనిమిదేళ్లపాటు ఆర్థిక, సామాజిక అభివృద్ధి పథంలో నడిపించిన సాయ్ ఇంగ్- వెను నుంచి లయి్చంగ్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
ఈ ఏడాది జనవరి లో జరిగిన తైవాన్ అధ్యక్ష ఎన్నిక ల్లో అధికార డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) గెలుపొందింది. డీపీపీ తరపున బరిలోకి దిగిన లాయ్ చింగ్ విజయం సాధించారు. మే 20 (సోమవారం) బాధ్యతలు చేపట్టారు. తైవాన్ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన లయ్ చింగ్ తేకు పలు దేశాలు అభినందనలు తెలిపాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com