Car Accident : అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన హారిక(24) గతేడాది US వెళ్లి, యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఓక్లహామాలో MS చేస్తున్నారు. నిన్న వర్సిటీ నుంచి స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ముందు ఓ బైకర్ కిందపడటంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వెనకాల నుంచి వచ్చిన 3 కార్లు హారిక వాహనాన్ని బలంగా ఢీకొట్టాయి. ప్రమాదంలో ఆమె మరణించగా.. మిగతావారికి గాయాలయ్యాయి.
భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఆమె తన విధులు ముగించుకుని స్నేహితులతో కలిసి కారులో ఇంటికి బయలుదేరింది. ఇందులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. హారిక వెనుక సీటులో ఉంది. అయితే వాళ్లు వెళ్తున్న దారిలో వారి వాహనం ముందు బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి కిందపడిపోయాడు. దీంతో వాళ్లు కారును వెంటనే ఆపారు. వెనకాలే వేగంగా వచ్చిన రెండు, మూడు హారిక ఉన్న కారును ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. మిగతావారికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న హారిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కూతురు మృతదేహాన్ని వీలైనంత త్వరగా తమ వద్దకు చేర్చాలని కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com