Palestine : పాలస్తీనాను దేశంగా గుర్తించిన మరో 3 దేశాలు

Palestine : పాలస్తీనాను దేశంగా గుర్తించిన మరో 3 దేశాలు

ఇజ్రాయిల్ కి వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగా పాశ్చాత్య దేశాలు కీలక ఎత్తుగడను తీసుకున్నాయి. ఇప్పటికే అమెరికా, ఇతర యూరప్ దేశాల్లో పాలస్తీనాకు మద్దతుగా విద్యార్థులు పలు యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు.

తాజాగా ఐర్లాండ్ నార్వే, స్పెయిన్ దేశాలు పాలస్తానాను అధికారికంగా ఒక దేశంగా గుర్తించాయి. గాజాలో ఇజ్రాయిల్-హమాస్ మిలిటెంట్లకు తీవ్రంగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.

ఈ నిర్ణయంపై ఇజ్రాయిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఐర్లాండ నార్వేల్లోని తన రాయబారుల్ని వెనక్కి రావల్సిందిగా ఆదేశించింది. ఐర్లాండ్ నార్వేలకు స్పష్టమైన, నిస్సందేహమైన సందేశాన్ని పంపుతున్నాననీ... ఇజ్రాయిల్ తన సార్వభౌమత్వాన్ని బలహీనపరిచే, దాని భద్రతకు అపాయం కలిగించే వారి పట్ల మౌనంగా ఉండదని ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయిల్ కాట్ అన్నారు.

Tags

Next Story