South Africa : సౌతాఫ్రికాలో ఘోర ప్రమాదం.. చిన్నారి తప్ప అంతా బలి

పండుగ పూట సౌతాఫ్రికాలో (South Africa) విషాదం చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదశాత్తు ఓ బస్సు లోయలో పడింది. వంతనెపై నుంచి అదుపు తప్పిన బస్సు లోయలో పడటంటో.. 46 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క 8 ఏళ్ల బాలిక మాత్రమే ప్రాణాలతో బయటపడింది.
ఈస్టర్ పండుగ కోసం బస్సులో 47 మంది ప్రయాణికులు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. లోయలో బస్సు పడిన తర్వాత మంటలు చెలరేగాయి. దాంతో.. ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. బస్సు బోట్స్ వానా నుంచి మోరియాకు బయలుదేరింది. ఈ క్రమంలోనే కొండపై నిర్మించిన వంతెన మలుపు వద్ద బస్సు అదుపుతప్పింది. దాంతో.. డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయాడు. బస్సు వంతెనపై నుంచి 165 అడుగుల లోతు లోయలో పడిపోయింది.
బస్సు ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఇతర అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బస్సు లోయలో పడిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. దాంతో కొన్ని మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంలో ఒక 8 ఏళ్ల బాలిక తీవ్ర గాయాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈస్టర్ వీకెండ్ సందర్భంగా వంతెనపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో గస్తీ పెంచారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com