Trump Key Decision : పన్నుల విషయంలో తగ్గేదేలే.. ట్రంప్ కీలక నిర్ణయం

భారత్, అమెరికా ఎంత మిత్ర దేశాలైనా పన్నుల దగ్గరకు వచ్చే సరికి తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. పరస్పర పన్నుల విషయంలో తగ్గేదేలే అని సున్నితంగా తేల్చేశారు. రెసీప్రోకల్ టారిఫ్లపై చర్చ సందర్భంగా ట్రంప్ స్పందిస్తూ.. భారత్ సహా ఇతర దేశాలపై విధిస్తున్న పన్నులను సమర్థించుకొన్నారు. తమది రెసిప్రోకల్ నేషన్ (ఎదుటి దేశం ఎలా స్పందిస్తే.. అలానే ప్రతిస్పం దించే దేశం) అని చెప్పారు. అది ఏ దేశమైనా సరే మాపై తక్కువ పన్నులు విధిస్తే.. తాము కూడా అలానే టారిఫ్లు వేస్తామన్నారు. భారత్ తమపై ఎంత శాతం పన్ను విధిస్తే.. తామూ అంతే ఛార్జి చేస్తామని అన్నారు. తమకు ఐరోపా అత్యంత సమస్యాత్మక మని చెప్పారు. ఎవరూ కనీవినీ ఎరుగని స్థాయిలో తమపై దిగుమతి పన్నులు విధిస్తున్నారని చెప్పారు. వారు చాలా విషయాల్లో అడ్వాంటేజ్ తీసుకొంటు న్నారని వివరించారు. ఇండియాలో టారిఫ్లు చాలా ఎక్కువన్నారు. భారత్ ఎంత మొత్తం సుంకం విధి స్తుందో తామూ అంతే విధిస్తామని చెప్పారు. భారత్ లో సుంకాలు ఎక్కువగా ఉండడం వల్ల అమెరికా ఉత్పత్తులు ఎగుమతి కావడం లేదని, దాంతో అమె రికాకు నష్టం జరుగుతోందని ట్రంప్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com