Trump : ట్రంప్ టారిఫ్‌లు ఎదురుదెబ్బ కాదు: కేంద్ర ప్రభుత్వ వర్గాలు

భారతదేశ దిగుమతులపై అమెరికా 26% టారిఫ్ విధించడాన్ని తాము ఎదురుదెబ్బగా భావించట్లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇది మిశ్రమ ఫలితమే అని తేల్చి చెప్పాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్య సమస్యలను పరిష్కరిస్తే ఈ టారిఫ్‌లు తగ్గే అవకాశం ఉందని వెల్లడించాయి. ఈ మేరకు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని వివరించాయి. మరోవైపు, మన దేశ ఫార్మా ఉత్పత్తులకు టారిఫ్ నుంచి ట్రంప్ మినహాయింపు ఇచ్చారు. యూఎస్ చీఫ్ ట్రంప్ టారిఫ్స్‌పై ప్రపంచ నేతలు పెదవి విరుస్తున్నారు. యూరోపియన్ యూనియన్‌పై 20% టారిఫ్ విధించడాన్ని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తప్పు పట్టారు. మరోవైపు ట్రంప్ టారిఫ్ అన్యాయంగా ఉందని ఆస్ట్రేలియా పీఎం అల్బనీస్ వ్యాఖ్యానించారు. యూఎస్ బాస్ నిర్ణయంతో ఏ ఒక్కరికి ప్రయోజనం లేదని ఐర్లాండ్ ప్రధాని మార్టిన్ అన్నారు. ట్రంప్‌కు దీటుగా బదులిస్తామని చైనా ప్రభుత్వం హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com