Trump Tariffs : ట్రంప్ టారిఫ్స్.. భారత్‌పై ప్రభావమెంత?

ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. ఇందులో భారత్‌పై 26 శాతం సుంకం విధించారు. ఈ చర్యతో వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, వజ్రాలు, రసాయనాలు, యంత్రాలతోపాటు మరికొన్ని వస్తువులపై టారిఫ్స్ ప్రభావం ఎక్కువగా పడుతుందని నిపుణులు అంటున్నారు. సుంకాల కారణంగా భారత్‌కు రూ.26 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. ఇది దేశ GDPపై 0.1% ప్రభావం చూపుతుందని విశ్లేషిస్తున్నారు.
అమెరికా ప్రెసిడెంట్ టారిఫ్స్ పెంచడంతో ఆ దేశానికి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరగనున్నాయి. దీంతో విదేశీ కంపెనీలు అగ్రరాజ్యానికి వస్తువులను ఎగుమతి చేయడం తగ్గిస్తాయి. ఫలితంగా అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలు పెరుగుతాయి. అక్కడి వారికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి. కొన్నేళ్ల వరకు ధరలు పెరిగినా ట్రంప్ నిర్ణయం దీర్ఘకాలంలో ఆ దేశానికి మేలు చేస్తుందని విశ్లేషకుల మాట.
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వివిధ దేశాలపై టారిఫ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో యూఎస్ స్టాక్ మార్కెట్స్ ఒక్కసారిగా పడిపోయాయి. ఈ ప్రభావం ఏషియా మార్కెట్స్‌పై తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్న లాభాల్లో ముగిసిన భారత సూచీలు ఇవాళ భారీ నష్టాలను చవిచూడొచ్చని భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళనలో ఉన్నారు. కాగా భారత్, చైనా, కెనడా సహా పలు దేశాలపై ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com