Trump Warning : ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

న్యూక్లియర్ ఒప్పందానికి అంగీకరించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌ను యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. టారిఫ్‌లు రెట్టింపు చేయడమే కాకుండా అవసరమైతే బాంబు దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు యూఎస్ విధిస్తున్న ఆంక్షలతో ఇరాన్ గతంలో ఎప్పుడూ లేనంతగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
అగ్రరాజ్య అధినేత ట్రంప్ ఏప్రిల్ 2న తీసుకోనున్న ఓ నిర్ణయంపై భారత్ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. భారత్ నుంచి ఆమెరికాకు ఎగుమతి అవుతున్న మందులపై 25% టారిఫ్ విధిస్తామని, దానిపై బుధవారం తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. మనం ఏటా 30బి.డాలర్ల మందులు విక్రయిస్తుండగా, 3వ వంతు అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం మన ఎగుమతులపై అమెరికాలో పెద్దగా సుంకాల భారం లేనప్పటికీ భారత్ ఆమెరికా నుంచి వస్తున్న వాటిపై 10% సుంకం వసూలు చేస్తోంది.
హమాస్ ఆయుధాలు వీడి, గాజాలోని తమ బందీలను విడుదల చేస్తేనే కాల్పుల విరమణ గురించి ఆలోచిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. హమాస్ నేతలందరూ గాజాను వీడి పారిపోవాలని ఆయన అల్టిమేటం జారీ చేశారు. గాజాలో ట్రంప్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పారు. కాగా నిన్న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలో 22 మంది మరణించారు. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు సివిల్ డిఫెన్స్ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com