Donald Trump : ఇజ్రాయెల్ తరహా ఐరన్ డోమ్ కట్టిస్తా.. ట్రంప్ సంచలనం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రచార బృందాల విమర్శల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఫిలిడెల్ఫియాలోని టెంపుల్ యూనివర్శిటీ క్యాంపస్ వద్ద తాజాగా శనివారం రాత్రి నిర్వ హించిన ప్రచార ర్యాలీలో మాట్లాడిన ట్రంప్.. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికాను నాలుగేళ్ల క్రితం ఎలా ఉందో అలాంటి స్థితికి తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు.
"అమెరికాను గొప్ప దేశంగా నిలబెడతాను. మన దేశానికి సురక్షితమైన సరిహద్దులు ఉండేవి. అయితే, ఇప్పుడు రక్షణ లేని సరిహద్దు దేశంగా మారాం. ఇది మన దేశానికెంతో ప్రమాదకరం. మన రక్షణ వ్యవస్థలో మార్పులు తేవాలి. ఇజ్రాయెల్ కు ఉన్నటు వంటి డోమ్ ను ఏర్పాటు చేయిస్తా.." అని ట్రంప్ చెప్పారు.
మెక్సికో సరిహద్దులో వివాదాలు ఇంకా కొనసాగుతున్నా యని, దాంతో అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో అమెరికా లోకి వలసలు జరుగుతున్నాయన్నారు. ఈ వలస లను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com