Israel : ఇజ్రాయెల్ పై ఐక్యరాజ్యసమితి సీరియస్

Israel : ఇజ్రాయెల్ పై ఐక్యరాజ్యసమితి సీరియస్
X

రఫాలో ఇజ్రాయెల్ దాడిని ప్రపంచ దేశాలు ఐక్యంగా వ్యతిరేకి స్తున్నాయి. 45 మంది సామాన్య పౌరుల ప్రాణాలను బలితీసుకున్న ఈ దాడిని తీవ్రం గా తప్పు పడుతున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఘోరాన్ని ఆపాలని తీవ్ర స్వరంలో హెచ్చరించింది.

ఇది మారణహోమం నుంచి ఆశ్రయం కోరుతున్న సామాన్యులపై జరిగిన దాడి అని ప్రపంచం ఆక్షేపించింది. అనేక మంది మృతికి కారణమైన ఇజ్రాయెల్ దుందుకు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది.

గాజాలో అసలు సురక్షిత ప్రాంతమే లేదని, ఈ ఘోరాన్ని వెంటనే ఆపాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో

గుటెరస్ గట్టిగా కోరారు. రఫాలో ఇజ్రాయెల్ చేసిన దాడిలో 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా గాయపడ్డారు.

Tags

Next Story