America : అమెరికా రేస్.. ట్రంప్, బైడెన్ మరో ముందడుగు

America : అమెరికా రేస్.. ట్రంప్, బైడెన్ మరో ముందడుగు

అమెరికా (America) అధ్యక్ష రేస్ ఆసక్తిగా మారింది. న్యాయపరమైన సమస్యలు, వివాదాల నేపధ్యంలోనే ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫ్లోరిడా, ఓహాయోల్లో జరిగిన ప్రైమరీల్లో అదనపు డెలిగేట్లను పొందారు. రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ తరఫున జో బైడెన్ నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడనున్నారు.

ట్రంప్, బైడెన్ లు ఫ్లోరిడా, ఒహాయో రాష్ట్రాల్లో విజయం సాధించారు. రాష్ట్రాల్లో సెనేట్ రేసు అధ్యక్ష రేసు కన్నా ఆసక్తికరంగా ఉంది. ఫ్లోరిడా రాష్ట్ర రిపబ్లికన్ ప్రైమరీలో విజేతగా ట్రంప్ కు మద్దతు లభించగా, డెమొక్రాట్లకు ఒక్క సీటు కూడా దక్కలేదు. ప్రచారం నుంచి తప్పుకున్నప్పటికీ, దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీని ఓహాయో, ఇల్లినాయిస్ వంటి రాష్ట్రాల్లో బ్యాలెట్ లో ఉంచారు.

డెలిగేట్ల వైపు నుంచి తమకు మద్దతు లభించడంతో ట్రంప్, బైడెన్ ఇద్దరూ ఎన్నికల తుది ఫలితాలను ప్రభావితం చేసే స్వింగ్ రాష్ట్రాలపై దృష్టి సారించారు. తమ ప్రచార ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాగా, ఇమిగ్రేషన్ కు సంబంధించి ట్రంప్ విధానాలపై జో బైడెన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. యువత, లాటినో కమ్యూనిటీలను ఆకర్షించేలా జో బైడెన్ తన ప్రచార వ్యూహాలను రూపొందించుకున్నట్లు కనిపిస్తోంది. వలసలు, అబార్షన్లపై ట్రంప్ విధానాలను విమర్శించడానికి బైడెన్ ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ఫ్లోటింగ్ ఓటర్లను గెలుచుకోవడంలో ఈ వ్యూహం ప్రధాన పాత్ర పోషిస్తుందనే నమ్మకంతో బైడెన్ ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story