Zelensky : ఉక్రెయిన్‌కు రండి.. ట్రంప్‌కు జెలెన్‌స్కీ ఆహ్వానం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ సందర్శించాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. రష్యా తమ దేశంలో చేసిన విధ్వంసం చూడాలన్నారు. యుద్ధంతో తమ దేశంలో నెలకొన్న పరిస్థితులు, మరణించిన, గాయపడిన ప్రజలు, దెబ్బతిన్న కట్టడాల్ని చూసిన అనంతరం ఏదైనా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఫిబ్రవరిలో ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య జరిగిన చర్చలు వాగ్వాదంతో అర్ధాంతరంగా ముగిశాయి.
‘‘యుద్ధాన్ని ముగించాలని పుతిన్ ఎప్పుడూ కోరుకోలేదు. మా దేశాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నాడు. అందుకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మాస్కో మాపై దాడులు చేస్తోంది. నేను పుతిన్‌ను నమ్మనని చాలాసార్లు అమెరికా అధ్యక్షుడితో చెప్పాను. రష్యా మారణహోమంలో అనేకమంది చనిపోతున్నారు. దయచేసి ఏవైనా నిర్ణయాలు తీసుకొనే ముందు, చర్చలు చేపట్టేముందు వారిని చూడటానికి రండి. దాడులు జరుగుతున్న ఏ నగరంలో అయినా మీరు పర్యటించవచ్చు’’ అని జెలెన్‌స్కీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com