Zomato CEO : మెక్సికన్ మోడల్ ను రెండో పెళ్లి చేసుకున్న జొమాటో సీఈవో

Zomato CEO : మెక్సికన్ మోడల్  ను రెండో పెళ్లి చేసుకున్న జొమాటో సీఈవో

జొమాటో సీఈవో (Zomato CEO), వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్.. మెక్సికన్ మాజీ మోడల్ గ్రీసియా మునోజ్‌ను వివాహం చేసుకున్నారని, వీరి పెళ్లి ఒక నెల క్రితమే జరిగిందని పలు నివేదికల ప్రకారం తెలుస్తోంది. ఈ జంట ఫిబ్రవరిలో తమ హనీమూన్‌ను కూడా ఓ తెలియని ప్రదేశంలో గడిపినట్టు సమాచారం.

మీడియా కథనాల ప్రకారం, గోయల్, మునోజ్ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారని, ఒక ప్రైవేట్ వేడుకలో పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. మెక్సికోలో జన్మించిన మునోజ్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో తాను భారతదేశంలో "ఇప్పుడు ఇంట్లో" ఉన్నానని, విలాసవంతమైన వినియోగదారు ఉత్పత్తులలో డీల్ చేస్తూ తన స్వంత స్టార్టప్‌లో పనిచేస్తున్నానని చెప్పింది. ఆమె 2022 సంవత్సరానికి యునైటెడ్ స్టేట్స్‌లో జరిగిన మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్ విజేత కూడా.

ఇది గోయల్ కు రెండో వివాహం. గతంలో అతను IIT-ఢిల్లీలో విద్యార్థిగా ఉన్నప్పుడు పరిచయమైన కంచన్ జోషిని వివాహం చేసుకున్నాడు. జోషి ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story