తాజా వార్తలు

ఇసుక వారోత్సవాలు ముగుస్తున్నా.. ఇసుక మాత్రం లేదు: బాబు

ఇసుక వారోత్సవాలు ముగుస్తున్నా.. ఇసుక మాత్రం లేదు: బాబు
X

ba

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న ఏపీని నాశనం చేశారని విమర్శించారు. అమరావతి రాకూడదనే ఉద్దేశంతో కమిటీలపై కమిటీలు వేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. జగన్ వ్యవహారశైలి వల్ల అమరావతిని కోల్పోయామంటూ మండిపడ్డారు. రెండురోజుల పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు చంద్రబాబు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు గురువారంతో ముగుస్తున్నప్పటికీ.. ఎక్కడా ఇసుక దొరకడం లేదని ఆరోపించారు. ఇసుక మాఫియాను ఎందుకు అరికట్టలేకపోతున్నారని నిలదీశారు. ఏపీ ఇసుక ఇతర రాష్ట్రాల్లో దొరుకుతుంది.. గానీ రాష్ట్రంలోని ప్రజలకు మాత్రం లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES