భారత్‌లో కలకలం రేపుతున్న తొలి కరోనా మరణం

X
TV5 Telugu13 March 2020 2:53 PM GMT
భారత్‌లో కరోనా తొలి మరణం కలకలం రేపుతోంది. కర్నాటకకు చెందిన సిద్ధిఖీ.. కరోనా కాటుకు బలైపోయాడు. అంతకుముందు ఆయన ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లో గడిపాడు. తలాబ్‌కట్ట ప్రాంతంలో ఆయనకు బంధువులు ఉన్నారు. వాళ్ల ఇంటికి వచ్చిన సిద్ధిఖీ.. కరోనా లక్షణాలతో కేర్ ఆస్పత్రికి వెళ్లాడు. వాళ్లు గాంధీ హాస్పిటల్‌కు వెళ్లండని సూచించగా.. ఆయన నేరుగా బెంగళూరు వెళ్లినట్టు చెప్తున్నారు. బీదర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా లాభం లేకపోయింది.
సిద్ధిఖీ హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ తిరిగాడు? ఆయా ప్రాంతాల్లో పరిస్థితిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.
Next Story