లాక్‌డౌన్ నింబంధనలు మీకు వర్తించవా?: చంద్రబాబు

కరోనా కట్టడి చేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైనదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కరోనా పై వాస్తవాలు దాస్తున్నారని.. దీనిపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే.. కేసులు పెడతారా అని మండిపడ్డారు. కరోనాపై కేరళ ప్రభుత్వం చేస్తూన్న విధంగా ఏపీ ప్రభుత్వం ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. వాలంటీర్లతో సరుకులు ఎందుకు డోర్ డెలివరీ చేయడం లేదన్నారు. మాస్క్‌లు ఇవ్వండని జూనియర్ డాక్టర్లు అడుక్కోవలసిన అవసరమేంటని ధ్వజమెత్తారు. దానం చేయాలనుకుంటే ప్రభుత్వానికి చెప్పి చేయాలని జీవో జారీ చేయడం దుర్మార్గం చంద్రబాబు అన్నారు.
అటు విజయసాయిరెడ్డిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయసాయిరెడ్డి రాష్ట్రమంతా తిరుగుతున్నారని.. లాక్‌డౌన్ నింబంధనలు ఆయనకి వర్తించవా అని ప్రశ్నించారు. హాట్‌స్పాట్లలో వైసీపీ నేతలు పర్యటించడం మానుకోవాలని అన్నారు. ఓ ఎమ్మెల్యే పూలవర్షం కురిపించుకున్నారని పరోక్షంగా రోజాపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతల ప్రవర్తన జుగుప్సాకరంగా ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com