Telugu States : అలర్ట్.. ఈ సమయంలో బయటకు రావొద్దు

Telugu States : అలర్ట్.. ఈ సమయంలో బయటకు రావొద్దు

తెలంగాణలో (Telangana) ఎండల తీవ్రత ఎక్కువైన నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నేడు, రేపు వడగాడ్పులు వీచే అవకాశం ఉండటంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని వార్నింగ్ ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 7 తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు.

మరోవైపు ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో వడగాలులు తీవ్రమయ్యాయి. రాయలసీమలో ఉష్ణోగ్రతలు ఏకంగా 43 డిగ్రీలు దాటాయి. దీంతో వాతావరణ శాఖ రాయలసీమ, దక్షిణ కోస్తా, నెల్లూరు, ప్రకాశం, పల్నాడుకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈరోజు, రేపు ఏపీ, తెలంగాణలో తీవ్ర వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో నిన్న 4 జిల్లాల్లో 43.5, ఏపీలోని 9 జిల్లాల్లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఆదివారం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. ఏపీలోని 8, 9 తేదీల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story