AP : అలీ మరో కీలక నిర్ణయం
సినీ నటుడు అలీ (Ali).. వైసీపీకి (YCP) సన్నిహితుడు. పవన్ కల్యాణ్ కు (Pawan Kalyan) సినిమాల్లో ఎంత దగ్గరైనా పొలిటికల్ మాత్రం ఆయన శత్రువే. కొద్దిరోజులుగా ఈ సంఘర్షణ అనుభవించిన అలీ.. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల టైంలో ఓ దృఢ నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని అలీ నిర్ణయించుకున్నారు. సీటు రాని కారణంగానే వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఆలీ పాల్గొనటం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒక దశలో ఆలీకి నంద్యాల ఎంపీ లేదా, మరో చోట నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారని ప్రచారం సాగింది. ఆలీకి సీటు దక్కకపోవటంతో కొంత కాలంగా మౌనంగా ఉంటున్నారు.
మైనార్టీ వర్గాలకు వైసీపీ ఏడు స్థానాలు కేటాయించింది. ఆలీకి భవిష్యత్ పదవి పైన జగన్ నుంచి హామీ ఉందనేది మరో వాదన. వైసీపీ కోసం స్నేహితులకు దూరమైన అలీకి సీటు ఇవ్వకపోవటంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలీ నిర్ణయం ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com