AP : ఏపీలో టెన్త్ క్లాస్ హాల్ టికెట్లు విడుదల

AP : ఏపీలో టెన్త్ క్లాస్ హాల్ టికెట్లు విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ హాల్ టికెట్లు విడుదల చేసింది. విద్యార్థులు నేరుగా ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జిల్లా, స్కూలు పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్ టికెట్ పొందవచ్చు. హాల్ టికెట్లు పొందేందుకు ఈ వెబ్ సైట్ లో (www.bse.ap.gov.in) అందుబాటులో ఉన్నాయి.

ఏపీలో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు 6, 23, 92 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు.. 3,05,153 మంది బాలికలున్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు. ఏపీలో పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు.

ఏపీ 10వ తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ ఇదే

మార్చి 18- ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1

మార్చి 19- సెకండ్ లాంగ్వేజ్

మార్చి 20- ఇంగ్లిష్

మార్చి 22- మ్యాథ్స్‌

మార్చి 23- ఫిజికల్ సైన్స్

మార్చి 26- బయాలజీ

మార్చి 27- సోషల్ స్టడీస్

మార్చి 28- ఫస్ట్‌ లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1

మార్చి 30- ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), ఓకేషనల్ కోర్సు పరీక్ష ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story