TDP: టీడీపీలో భారీగా చేరుతున్న వైసీపీ నేతలు

TDP: టీడీపీలో భారీగా చేరుతున్న వైసీపీ నేతలు
టీడీపీలో చేరిన ఎమ్మెల్యే పార్థసారథి, తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తానన్న నరసాపురం ఎంపీ

వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్.., కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ తెలుగుదేశంలో చేరారు. అనుచరులతో కలిసి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన నేతలు నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. మరోవైపుచం ద్రబాబు సమక్షంలో రెండు రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు మైలవరం MLA వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. స్థానిక నేతలతో చర్చించి కార్యకర్తలందరినీ కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తానని వెల్లడించారు. దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత వైరాలు లేవని వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. అధిష్ఠానం సమక్షంలో దేవినేనితో అన్నీ మాట్లాడుకుంటామన్నారు. వైసీపీలో విపక్షాలను దూషిస్తేనే మంత్రి పదవులు ఇస్తారని వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు.


వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు నరసాపురం ఎంపీ లావు కృష్ణదేవరాయలు వెల్లడించారు.త్వరలో తెలుగుదేశంలో చేరుతానని స్పష్టంచేశారు. పల్నాడు జిల్లా ప్రజలకు బహిరంగ లేఖ రాసిన ఆయన ఐదేళ్లుగా నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు ఎంతో ప్రేమాభిమానాలు చూపించారని గుర్తుచేసుకున్నారు. గత ఐదేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పల్నాడు జిల్లా అభివృద్ధికి కృషి చేశాననిమరోసారి అవకాశం ఇస్తే మరింత ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి ఇప్పటికే అనుమతులు తెచ్చానని ఆ ప్రాజెక్టుని పూర్తిచేసి పల్నాడు ప్రజల చిరకాలవాంఛ నెరవేరుస్తానని కృష్ణదేవరాయలు తెలిపారు. 12వందల కోట్లతో వాటర్ గ్రిడ్ పనులు, సాగర్ కుడికాలువకు నకరికల్లు వద్ద లిఫ్ట్ ఏర్పాటు, పిడుగురాళ్ల వైద్యకళాశాల, 3వేల కోట్లతో మంజూరైన జాతీయ రహదారుల్ని పూర్తి చేయించడం తన లక్ష్యమని పేర్కొన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి.. వారి అభివృద్ధి కోసం పనిచేస్తానని బహిరంగ లేఖలో వివరించారు.


మరోవైపు వచ్చే ఎన్నికలకు... తొలి జాబితాలో టికెట్ దక్కని నేతలు, ఆశావహులు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసానికి...వరస కడుతున్నారు. పెనుగొండ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడిన బీకే పార్దసారధి... చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనంతపురం లోక్ సభ నుంచి పోటీ చేయాలని బీకేకు అధినేత సూచించారు. అనంత నుంచి బీకే గెలుస్తారని సర్వే రిపోర్టులు వచ్చాయని.. చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమని బీకే పార్దసారధి చెప్పారు. ఏదోక స్థానం నుంచి తనకు పోటీ చేసే అవకాశం కల్పించాలని మరో నేత నిమ్మల కిష్టప్ప చంద్రబాబును కోరారు. ఏలూరు ఎంపీ స్థానం ఆశిస్తున్న కంభంపాటిరామ్మోహనరావు కూడా అధినేతను కలిసి... చర్చలు జరిపారు. తొలి జాబితాలో పేరులేని ఉంగుటూరు ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు.. చంద్రబాబును కలిశారు. ఇదేసమయంలో తంబళ్లపల్లె టికెట్ ను శంకర్ యాదవ్ కే కేటాయించాలంటూ... ఆయన అనుచరులు..... పది బస్సుల్లో చంద్రబాబు నివాసానికి తరలివచ్చి..... డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆ స్థానానికిజయచంద్రారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. శంకర్ యాదవ్ కే టికెట్ ఇవ్వాలంటూ కరకట్టపై ఆయన అనుచరులు నిరసనకు దిగగా.. భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story