Chandrababu: సత్యహరిశ్చంద్రుడిలా జగన్‌ ఫోజులిస్తున్నాడు: చంద్రబాబు

Chandrababu: సత్యహరిశ్చంద్రుడిలా జగన్‌ ఫోజులిస్తున్నాడు: చంద్రబాబు
Chandrababu: చెత్త మీద పన్ను వేసే ఈ ప్రభుత్వాన్ని చెత్త ప్రభుత్వం అంటారన్నారు చంద్రబాబు.

Chandrababu: చెత్త మీద పన్ను వేసే ఈ ప్రభుత్వాన్ని చెత్త ప్రభుత్వం అంటారన్నారు చంద్రబాబు. త్వరలో జుట్టుపైనా పన్ను వేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల తాళిబొట్టులు తెంచేసే జగన్‌ రెడ్డి.. మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపి అప్పులు తెచ్చారంటూ మండిపడ్డారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని 25 ఏళ్లు తాకట్టుపెట్టి మద్యనిషేధం ఉండదని చెప్పేశారన్నారు. జగన్‌ ఇచ్చేది గోరంత.. దోచేది కొండంత అన్నారు చంద్రబాబు..

జగన్‌ రెడ్డి సత్య హరిచంద్రుడిలా ఫోజులిస్తున్నారని, సత్యహరిచంద్రుడు పోతుపోతూ.. ఆ స్థానంలో తనను పెట్టారన్న రీతిలో సీఎం జగన్‌ భావిస్తున్నారన్నారు. ఆడబిడ్డలకు టీడీపీ ఇళ్లు ఇస్తే.. ఆ ఇళ్లపై జగన్‌రెడ్డి ఓటీఎస్‌ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర మహిళలకు అమరావతి మహిళల ఉద్యమం స్పూర్తి కావాలన్నారు. జగన్‌ తొందర్లోనే.. ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారన్నారు చంద్రబాబు.

వ్యతిరేకత పెరుగుతందని ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్దంగా ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన.. జగన్‌ ఇంటికి పోవడం ఖాయమన్నారు చంద్రబాబు. నెత్తిమీద కుంపటిని దించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వివేకా హత్య కేసులో.. సీఎం జగన్‌ సొంత చెల్లిలికే న్యాయం చేయలేదన్నారు చంద్రబాబు. ఇక జగనన్న వదిలిన బాణం ఇప్పుడు ఎక్కడుందని ప్రశ్నించారు.

సొంత చెల్లెళ్లకు న్యాయం చేయలేని జగన్‌.. రాష్ట్రంలో మహిళలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. మహిళలపై అనేక అరాచకాలు జరుగుతున్నా.. సీఎం జగన్‌ వాటిని నియంత్రించలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. దిశ చట్టం లేకపోయినా.. దిశ పోలీస్‌ స్టేషన్లు పెట్టి ప్రజల్ని మభ్యపెడుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు. పేరుకే దిశ పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయని.. మహిళలపై దారుణాలు జరుగుతుంటే.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేకపోతున్నారంటూ మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story