రామతీర్థం వెళ్లకుండా నన్ను ఎందుకు అడ్డుకున్నారు? : చంద్రబాబు

రామతీర్థం వెళ్లకుండా నన్ను ఎందుకు అడ్డుకున్నారు? : చంద్రబాబు
జ్ఞానం లేని ముఖ్యమంత్రి అజ్ఞానంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు.

రామతీర్ధం వెళ్లకుండా తనను ఎందుకు అడ్డుకున్నారంటూ ప్రశ్నించారు చంద్రబాబు. 5 రోజుల పాటు ఈ ప్రభుత్వం ఏ గడ్డి పీకిందని ఘాటైన విమర్శలు చేశారు. శ్రీరాముడి విగ్రహం తల తీసినప్పుడే.. ఈ ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాలని మండిపడ్డారు. సాయిరెడ్డిని తీసుకెళ్లి పూజలు చేయించిన అధికారులు.. తనను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు.

సీఎం, హోంమంత్రి, డీజీపీతో పాటు విజయనగరం ఎస్పీ కూడా క్రిస్టియనేనని.. మెజారిటీ ప్రజలైన హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యమంత్రి మతమార్పిడులు చేయిస్తున్నారని, పోలీస్‌ స్టేషన్లలో క్రిస్మస్ వేడుకలు చేయిస్తూ.. శ్రీవారి ఆలయంలో క్రిస్మస్ శుభాకాంక్షలు ఎలా చెబుతారని ప్రశ్నించారు.

జిల్లా ఇన్‌ఛార్జిగా ఉన్న వెల్లంపల్లి.. అశోక్‌ గజపతి రాజుపై వ్యాఖ్యలు చేస్తారా అని మండిపడ్డారు. గజపతి కుటుంబంతో వీళ్లెవ్వరికీ పోలిక లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్ఞానం లేని ముఖ్యమంత్రి అజ్ఞానంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. గాలి కబుర్లు చెబుతూ, గాల్లో తిరిగే ఫేక్‌ సీఎం.. వైఎస్‌ జగన్‌ అని విమర్శించారు. కరోనా విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అందరినీ ఇబ్బందుల్లోకి నెట్టారని అన్నారు.


Tags

Read MoreRead Less
Next Story