Telugu States : నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు

Telugu States : నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు

నేడు, రేపు భానుడు ఉగ్రరూపం దాల్చనున్నాడు. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం ఏపీలో (AP) కొన్ని చోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అనంతపురం(D)లో 41 నుంచి 43 డిగ్రీలు, పల్నాడు, NTR జిల్లాల్లో 41-44, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూ.గో జిల్లాల్లో 41-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. నిన్న నంద్యాల(D) చాగలమర్రిలో గరిష్ఠంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

మరోవైపు తెలంగాణలో (Telangana) ఇవాళ, రేపు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. ఉ.11 నుంచి మ.3 వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని సూచించింది. నిన్న నల్గొండ(D) ఇబ్రహీంపేటలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, 2016 తర్వాత ఈ ఏడాదే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story