Assets : జేడీ లక్ష్మీనారాయణ ఆస్తులు ఎంతంటే?

Assets : జేడీ లక్ష్మీనారాయణ ఆస్తులు ఎంతంటే?

సీబీఐ మాజీ జేడీ వీవీ.లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్ పార్టీ’ తరఫున విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం తన కుటుంబ ఉమ్మడి ఆస్తి రూ.11.81 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. వాటిలో చరాస్తులు రూ.7.33 కోట్లు, స్థిరాస్తులు రూ.1.27 కోట్లు. ప్రస్తుతం ఆయన కుటుంబ ఉమ్మడి ఆస్తి రూ.11.81 కోట్లు. అందులో స్థిరాస్తులు రూ.10.61 కోట్లు, చరాస్తులు రూ.1.21 కోట్లు. ఆయన పేరిట స్థిరాస్తులు రూ.5.75 కోట్లు, చరాస్తులు రూ.84.83 లక్షలు. భార్య ఊర్మిళ పేరిట స్థిరాస్తులు రూ.4.86 కోట్లు, చరాస్తులు రూ.36.57 లక్షలు. ఆయనపై కేసుల్లేవు. వాహనాలు కూడా లేవు.

జేడీ లక్ష్మినారాయణ 1965 ఏప్రిల్ 3 న కర్నూలు జిల్లా శ్రీశైలం లో జన్మించారు. ఆయన పాఠశాల విద్య స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సాగింది. ఆ తరువాత వరంగల్ లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజరీరింగ్ పూర్తిచేశారు. తర్వాత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఎం.టెక్ పూర్తి చేశారు. సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలనే సంకల్పంతో సివిల్ సర్వీసు పరీక్ష ఉత్తీర్ణులై మహారాష్ట్ర కేడర్ ఐ.పి.ఎస్ అధికారిగా చేరారు.

Tags

Read MoreRead Less
Next Story