AP : జగన్ రాయి కేసు.. నలుగురికి బేడీలు!

AP : జగన్ రాయి కేసు.. నలుగురికి బేడీలు!

విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి కేసులో పోలీసులు చేయాల్సిందంతా చేస్తున్నారు. సీసీ కెమెరాలు చూసి.. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. ఐతే.. నిందితులు మాత్రం పక్కాగా చిక్కడం లేదు. ఈ రాయి దాడి కేసులో ప్రస్తుతానికి నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారిలో రౌడీ షీటర్ కూడా ఉన్నాడు.

ఎట్టి పరిస్థితుల్లో రాయి విసిరిన వాడిని పట్టుకోవాలని పట్టుదల మీద ఉన్న విజయవాడ పోలీసులు.. ప్రైజ్ మనీ ప్రకటించారు. దుండగుడి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతిని పోలీసులు ప్రకటించారు. నిందితులపై ప్రజలకు సమాచారం అందించేందుకు డీసీపీ శ్రీనివాసరావు 9490619342, ఏడీసీపీ టాస్క్‌ఫోర్స్ 9440627089 అనే రెండు నంబర్లను పోలీసులు ప్రకటించారు. ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 8.04 గంటల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి చీకట్లో ఓ గులక రాయి తగిలిందని పోలీసులు నిర్ధారించారు.

గంగానమ్మ గుడి సమీపంలో ఒక వ్యక్తి తన అరచేతిలో పట్టుకున్న రాయిని విసిరాడని విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా చెప్పారు. సీఎం బస్సు ఎక్కి చేతులు జోడించి ప్రజలకు సైగ చేస్తున్నప్పుడు అది తగిలిందన్నారు. రాయి మరింత ముందుకు వెళ్లి సీఎం పక్కనే ఉన్న వైఎస్సార్సీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలి కింద పడిపోయాడని తెలిపారు. 24 సీసీటీవీ ఫుటేజీలు, వందలాది మొబైల్ ఫోన్ వీడియో రికార్డింగ్‌లు, ప్రత్యక్ష సాక్షుల ఖాతాలు తదితరాలను పోలీసులు పరిశీలించారు. కచ్చితంగా అతడిని పట్టుకుంటామన్నారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story