AP: పోలీసులు వేధించారన్న దుర్గారావు

AP: పోలీసులు వేధించారన్న దుర్గారావు
టీడీపీ మద్దతుదారుడైన తనపై రాయిదాడి నేరం మోపే కుట్ర.. తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారన్న దుర్గారావు

జగన్‌పై రాయి దాడి కేసులో పోలీసులు తనను మానసికంగా వేధించారని... వడ్డెరకాలనీకి చెందిన దుర్గారావు వాపోయాడు. నాలుగు రోజుల పాటు అదుపులోకి తీసుకుని C.C.S., మైలవరం పోలీస్‌ స్టేషన్లలో విచారించరన్నారు. A 1 గా ఉన్న సతీష్‌ను బెదిరించి... తెలుగుదేశం మద్దతుదారుడినైన తనపై నేరం మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. తెల్ల కాగితాలపై సంతకం చేయించుకున్నారని... తనకేదైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని దుర్గారావు అన్నారు.


సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటనకు, తనకూ ఎటువంటి సంబంధం లేదని... వేముల దుర్గారావు అన్నారు. ఈ ఘటనలో అనుమానితుడిగా దుర్గారావును గత మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల అనంతరం దుర్గారావును పోలీసులు విడిచిపెట్టారు . వన్ టౌన్ C.C.S.లో రెండు రోజుల పాటు విచారణ జరిపారని... అనంతరం మైలవరం పీఎస్‌కు తీసుకువెళ్లి విచారించారన్నారు . మొదటి రోజు అర్ధరాత్రి సతీష్ ను తన ఎదుట కూర్చోపెట్టి విచారించారన్నారు. తెదేపా తరఫున వడ్డెరకాలనీలో చురుకుగా వ్యవహరిస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని దుర్గారావు ఆరోపించారు. రాయి దాడి జరిగిన సమయంలో తాను ఘటనా స్థలంలో లేనన్నాడు. బొండా ఉమ దాడి చేయించారా అని... పోలీసులు ప్రశ్నించినట్లు తెలిపారు. తనకు, టీడీపీ నేతలకు... దాడితో ఎటువంటి సంబంధం లేదని పోలీసులకు స్పష్టం చేశానన్నారు .

జగన్‌పై రాయి దాడి తన కుమారుడు చేయలేదని... నిందితుడు సతీష్ తండ్రి దుర్గారావు చెప్పారు. సతీష్‌ను బలవంతంగా తీసుకెళ్లి తుపాకీతో బెదిరించి ఒప్పించారని ఆరోపించారు. ఎవరో చేసిన దాడికి తన అబ్బాయిని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పథకంతోనే సతీష్‌కు ఆశ చూపించి జగన్‌ను చంపేందుకే రాయి విసిరినట్లు చెప్పించారని... న్యాయవాది సలీం ఆరోపించారు. విచారణలో దుర్గారావుపైన పోలీసులు ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు. పోలీసుల ఒత్తిడికి దుర్గారావు తలొంచలేదని... నిజాన్ని నిర్భయంగా చెప్పారని సలీం అన్నారు . A 2గా బొండా ఉమాను, A 3గా దుర్గారావును ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story