సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ లేఖ

సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ లేఖ
ఆర్భాటంగా ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం పథకం కనీసం పది శాతం కూడా అందడం లేదంటూ లేఖలో పేర్కొన్నారు లోకేష్‌.

సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవాలంటూ... సీఎం జగన్‌కు లేఖ రాశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌. ప్రభుత్వ అసమర్ధ విధనాలతో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. నేతన్న జీవనాన్నికి అండగా నిలిచిన ఎన్నో పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని లేఖలే పేర్కొన్నారు. ఈ పథకాల రద్దుతో నేతన్నల ఉనికే ప్రశ్నార్థంగా మారిందన్నారు. రాయితీలు, ప్రోత్సాహకాల నిలిపివేత, ఆప్కో ద్వారా కొనుగోళ్లు లేక చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొనుగోళ్లు లేకపోవడంతో... నేతన్న బతుకు దినదిన గండంగా మారిందన్నారు లోకేష్‌. ఆర్భాటంగా ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం పథకం కనీసం పది శాతం కూడా అందడం లేదంటూ లేఖలో పేర్కొన్నారు లోకేష్‌.

ఓ పక్క కరోనా కష్టాలు... మరో పక్క ప్రభుత్వ నిబంధనలతో నేతన్నకు కనీస సహాయం అందడం లేదంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు లోకేష్. సొంతంగా మగ్గం ఏర్పాటు చేసుకునేందుకు ప్రతినేతన్నకు లక్షన్నర రూపాయల సబ్సిడీ రుణాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎత్తేసిన సంక్షేమ కార్యక్రమాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు తిరిగి అమలు చేసి... చేనేత రంగాన్ని ఆదుకోవాలని లేఖలో కోరారు లోకేష్‌.

Tags

Read MoreRead Less
Next Story