YCP : వైసీపీ చేరికపై ముద్రగడ పద్మనాభం కొత్త ప్రకటన.. ట్విస్ట్ ఇదే

YCP : వైసీపీ చేరికపై ముద్రగడ పద్మనాభం కొత్త ప్రకటన.. ట్విస్ట్ ఇదే

ఆంధ్ర రాజకీయాల్లో మలుపులు సస్పెన్స్ థిల్లర్ సినిమాలను తలపిస్తున్నాయి. పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వలసలు పెరుగుతున్నా.. డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకు పార్టీలు అంతకు మించిన అస్త్రాలను బయటకు తీస్తున్నాయి.

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ఏపీలో ఓ పవర్ పుల్ ఓట్ బ్యాక్ కు నాయకత్వం వహిస్తున్నలీడర్. ఆయన మాట కొందరికి శాసనం. సైలెంట్ గా ఉంటూనే రాజకీయం నడుపుతుంటారు ముద్రగడ పద్మనాభం. ఆయన అనూహ్యంగా జగన్ నాయకత్వంలోని వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 14న వైసీపీలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేరనున్నారు.

ఈ నెల 14న ఉదయం 8 గంటలకు కిర్లంపూడి నుంచి బయలు దేరుతున్నాననీ.. తనతో ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. తనతో వచ్చేవారు కావలసిన ఆహారం, ఇతర అవసరాలు వారి వాహనంలోనే తెచ్చుకోవాలని ముద్రగడ కోరడం విశేషం.ఈ ట్విస్టేంటి బాబూ అంటూ టీడీపీ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికపై ఇటీవలే ఓ బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. తాను వైసీపీలో చేరుతున్నట్లు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. జగన్ ను తిరిగి సీఎం చేయడమే లక్ష్యంగా.. తన వ్యక్తిగత కోరికలు ఏవీ లేకుండా వైసీపీ కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story